తన లుక్ చూస్తే నగల మీద తనకున్న ఇష్టం తెలుస్తోంది. మెడలో తెలుపు రంగు చోకర్, పొడవాటి గుత్త పూసల నెక్లెస్ సెట్, చెవులకు పొడవాటి కమ్మలు, నుదుటిన వెడల్పాటి పాపిడ బిల్ల పెట్టుకున్న ఆమె రాణి లాగా కనిపించారు. మేకప్ కోసం న్యూడ్ ఐషాడో, వింగ్డ్ ఐ లైనర్, దిద్దిన కనుబొమ్మలు, బుగ్గల మీద బ్లష్, మెరుపు కోసం హైలైటర్, పెదాలకు గ్లాసీ పింక్ లిప్స్టిక్ తో లుక్ పూర్తి చేశారు. జుట్టును సిగలాగా కట్టుకున్నారు.