“మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఇద్దరూ బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా సివిల్ కాంట్రాక్టులకు టీటీడీ నిధులను పక్కదారి పట్టించారు. బడ్జెట్ పరిమితిని అధిగమించి మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రూ. 475 కోట్లకు పెంచగా.. అనంతరం ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కరుణాకర్ రెడ్డి భారీగా రూ.1,772 కోట్లకు బడ్జెట్ పెంచి తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికల్లో భూమన అభినయ్ రెడ్డికి లబ్ది చేకూర్చేందుకు టీటీడీలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి అక్రమాలు తెగబడ్డారు. శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.10,500 వసూలు చేసి ఆ డబ్బులు ఏ రకంగా ఖర్చు చేశారో చూపించలేదు. ఎవరు టీటీడీకి విరాళాలు ఇచ్చినా అవి శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్‌లోకి జమవ్వడంతో టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే ఏ పని అయినా చేసుకునేలా అవకాశం కల్పించారు. పద్మావతి ఆసుపత్రి(రూ.550 కోట్లు), బాలాజీ ఇన్స్ స్టిట్యూట్(రూ.324 కోట్లు), స్విమ్స్ కార్డియోన్యూరో బ్లాక్ నిర్మాణాల్లో కూడా భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఆసుపత్రుల నిర్మాణానికి రూ.1 కోటి నుంచి 1.5 కోట్లు విరాళం ఇచ్చే భక్తులకు 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు ఇచ్చి భారీ కుంభకోణానికి తెరలేపారు”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here