దేవగురువు కృప వల్ల అదృష్టం పొందుతారు. జ్ఞానం, పిల్లలు, ధార్మిక పనులు, వివాహం, సంపద, సద్గుణం, ఎదుగుదల మొదలైన వాటికి గురు గ్రహం కారకంగా చెప్తారు. బృహస్పతి 2024 ఆగస్ట్ 20 వరకు రోహిణి నక్షత్రంలో సంచరిస్తాడు.ఈ పరిస్థితుల కారణంగా ఇది కొన్ని రాశిచక్రాలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శుక్రుడు, బృహస్పతి అనుగ్రహం కొన్ని రాశుల మీద ఉంటుంది. ఇవి రెండు శుభ గ్రహాలుగా పరిగణిస్తారు. రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచరించినప్పుడు గొప్ప ప్రయోజనాలు పొందబోతున్న రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం.