పుతిన్ ఆహ్వానం మేరకు జూలై 8, 9 తేదీల్లో జరిగే భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవుతారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రధాని మోదీ పర్యటన ఇదే తొలిసారి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఫిబ్రవరి 2022లో ప్రారంభమైంది. పశ్చిమ దేశాల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ, భారతదేశం సైలెంట్‌గానే ఉంది. భారతదేశం-రష్యా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా వ్యవహరించింది. చమురు కొనుగోలును కొనసాగించింది. యుద్ధ సమయంలో కూడా రష్యాకు డబ్బు కొరత లేదు. అయితే శాంతికి తాము అనుకూలమని రష్యాకు భారత్ స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి శాంతి చర్చలే పరిష్కారమని ప్రధాని మోదీ పదే పదే పునరుద్ఘాటించారు. ఇప్పుడు ప్రధాని మోదీ పర్యటనతో తమకు భారతదేశం మద్దతు కూడా ఉందని రష్యా చూపించుకునే ప్రయత్నం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here