సూర్యాపేట జిల్లా: అర్హులైన పేదలందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ప్రతి మనిషికి పది కేజీల చొప్పున ఇవ్వాలని సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపుదాసు సాయికుమార్ డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలని ఆదుకునేందుకు ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తుందన్నారు.

 Thin Rice Should Be Given To All The Deserving Poor, Thin Rice , Poor People, Cp-TeluguStop.com

ప్రభుత్వం ఇస్తున్న దొడ్డు బియ్యం ప్రజలు తినలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు 14 రకాల నిత్యవసర సరఫరా చేయాలని కోరారు.

సూర్యాపేట పట్టణంలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జరుగుతుందని,అక్రమంగా బియ్యం వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.పట్టణంలో అనేక మందికి రేషన్ కార్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

పట్టణ కమిటీ సభ్యులు అర్వపల్లి లింగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, షేక్ జహంగీర్,మామిడి సుందరయ్య,పిట్టల రాణి, శశిరేఖ,జయమ్మ,కప్పల సత్యం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here