స్వల్ప విరామం తర్వాత మంగళవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఆకాశం మేఘావృతమై, క్షణాల్లో కుండపోత ప్రారంభం కావడంతో, బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు తడిసిముద్దయ్యారు. భారీ వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.