ఎలక్ట్రిక్ ఎస్ యూ వీలపై..
టాటా నెక్సాన్ ఈవీ, టాటా పంచ్ ఈవీ సహా అన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లను టాటా మోటార్స్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ ఎస్యూవీలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రతి కస్టమర్ సెగ్మెంట్ కు సరైన ఎస్ యూవీని అందించడమే తమ విజయమని టాటామోటార్స్ పేర్కొంది. టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్ లోకి టాటా కార్వ్, టాటా కర్వ్ ఈవీలతో ప్రవేశిస్తోంది.