అయితే ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పింది. అలాగే ప్రభుత్వానికి సీన‌రైజ్ ట‌న్నుకు రూ.88 త‌ప్ప మ‌రేది అవ‌స‌రం లేద‌ని చెబుతుంది. అలాంట‌ప్పుడు ర‌వాణా ఛార్జీకి ఇంత అధిక మొత్తంలో వ‌సూలు చేస్తున్నార‌ని విమ‌ర్శలు వ‌స్తున్నాయి. గ‌త ప్రభుత్వానికి ఇసుక వ‌ల్ల ఏటా రూ.780 కోట్లు వ‌చ్చేవి. కానీ ఈ ప్రభుత్వానికి రూపాయి కూడా అవ‌స‌రం లేద‌ని చెబుతుంది. ప్రజ‌ల నుంచి వ‌సూలు చేసే ఈ మొత్తం డ‌బ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నలు వ‌స్తున్నాయి. ఇప్పుడు వ‌ర‌ద నీరు రావ‌డంతో రీచ్‌ల వ‌ద్ద ఇసుక త‌వ్వకాలు లేకుండా, కేవ‌లం స్టాక్ పాయింట్ల వ‌ద్ద ఉన్న 49 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల‌ ఇసుక‌నే అమ్ముతున్నారు. అలాంట‌ప్పుడు ఇప్పుడే ఇంత ధ‌ర ఉంటే, సెప్టెంబ‌ర్ త‌రువాత‌ వ‌ర‌ద‌లు త‌గ్గి, ఇసుక రీచ్‌ల వ‌ద్ద ఇసుక త‌వ్వకాలు నిర్వహిస్తే అప్పుడు ఇసుక ధ‌ర మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో ఇళ్లు నిర్మాణాలు చేప‌ట్టే వారిపైన‌, భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌పై మ‌ళ్లీ ఇసుక ధ‌ర ప్రభావం ప‌డుతుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here