మా ఊరి పొలిమేర(polimera)హర్రర్ థ్రిల్లర్ గా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.అంతే కాకుండా ఎన్నో చిన్న సినిమాలకి సంజీవిని గా కూడా నిలిచింది. మొదటి పార్ట్ ఓటిటిలో రిలీజ్ అవ్వగా, రెండవ పార్టు థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఇప్పడు ఈ సిరీస్ కి సంబంధించిన తాజా న్యూస్ పొలిమేర స్థాయిని ఇంకో లెవల్ కి తీసుకెళ్తుంది.
.
పొలిమేర పార్ట్ 3 కి రంగం సిద్ధం అవుతుంది. అంతే కాదు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతుంది. ఈ మేరకు ఈ విషయాన్నీ మేకర్స్ కన్ఫార్మ్ చేశారు. ఇప్పుడు ఈ వార్త మూవీ లవర్స్ లో అట్రాక్షన్ గా మారింది. అదే విధంగా బడ్జట్ కూడా అందుకు తగ్గట్టే భారీగా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, భోగేంద్ర గుప్తా లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కి భోగేంద్ర గుప్తానే నిర్మాత.
స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దాదాపుగా పొలిమేర రెండు భాగాల్లో ఉన్న నటులు నటించబోతున్నారు.సత్యం రాజేష్(satyam rajesh)గెటప్ శ్రీను, పృథ్వీ, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్యలు ప్రధాన తారాగణంగా మెరవబోతున్నారు. రెండు బాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాధ్(anil viswanath)నే మూడవ భాగానికి కూడా దర్శకుడు.