ఇంటర్ అండ్ ఫైనల్ రిజల్ట్స్
చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్, సీఏ ఇంటర్మీడియట్ పరీక్షలను 2024 మేలో నిర్వహించారు. వాటి ఫలితాలను 2024 జూలై 11 గురువారం ప్రకటించనున్నారు. తమ ఫలితాలను విద్యార్థులు icai.nic.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. icai.nic.in వెబ్సైట్లో ఫలితాలను యాక్సెస్ చేయడానికి విద్యార్థి తన రోల్ నంబర్ తో పాటు రిజిస్ట్రేషన్ నెంబరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ (ICAI) గ్రూప్-1 కోసం ఐసీఏఐ సీఏ ఇంటర్ పరీక్షను 2024 మే 3, 5, 9 తేదీల్లో నిర్వహించారు. 2024 మే 11, 15, 17 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరిగాయి. 2024 మే 2, 4, 8 తేదీల్లో సీఏ ఫైనల్ గ్రూప్-1 పరీక్షలు, 2024 మే 10, 14, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరిగాయి. 2024 మే 14, 16 తేదీల్లో ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించారు.