ఆస్కార్‌కు రామోజీరావు చాలా ప్రాధాన్యమిచ్చారని, దీంతో తనకు కూడా ఆసక్తి పెరిగిందని ఇటీవలే కీరవాణి వెల్లడించారు. “ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినప్పుడు నాకు పెద్దగా సంతోషం అనిపించలేదు. అయితే నేను రామోజీరావును కలిసినప్పుడు, ఆస్కార్ తీసుకొని రావాలని ఆయన నాతో చెప్పారు. ఆయన ఆస్కార్ అవార్డుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారని, నేను గెలువాలని కోరుకున్నా. అప్పుడు అవార్డు విలువ తెలిసింది. అవార్డు ప్రకటించే కొన్ని సెకన్ల వరకు టెన్షన్‌గా ఉన్నా. అది నాకోసం కాదు.. ఆయన కోసం” అని కీరవాణి ఇటీవల చెప్పారు.
Home Entertainment MM Keeravani: ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన నాటునాటు తన బెస్ట్ సాంగ్ కాదన్న కీరవాణి