అసలేం జరిగిందంటే..?
పట్నాలో బుధవారం బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న ఒక ఐఏఎస్ అధికారితో పట్నాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. పట్నాలోని కంగన్ ఘాట్ వరకు జేపీ గంగా పథ్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఆయనను కోరారు. “కహియే తో హమ్ ఆప్కా పేర్ చు లేన్ (కావాలంటే నేను మీ కాళ్లు మొక్కుతాను)” అంటూ చేతులు జోడించి, ఆ అధికారి వద్దకు వెళ్లడానికి లేచి నిలబడ్డాడు. నితీశ్ మాటలతో అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు. ఆ అధికారి ‘‘సార్, దయచేసి ఇలా చేయకండి’ అంటూ పలు అడుగులు వెనక్కి వేశారు. అనంతరం ఆ అధికారి వివరణ ఇవ్వడానికిి ప్రయత్నించగా, సీఎం నితీశ్ అడ్డుకుని, పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయనను కోరారు.