మహారాజ
తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజ చిత్రం బ్లాక్బస్టర్ అయింది. ఈ సినిమా జూలై 12వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమ్ కానుంది. జూన్ 14న థియేటర్లలో రిలీజైన మహారాజ చిత్రం రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు.