సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో ఎలాంటి సినిమా తీసిన కూడా ఫైనల్ గా ఇక్కడ సక్సెస్ మాత్రమే క్యాలిక్లెట్ చేస్తారు.అంటే దాని ద్వారానే హీరోల యొక్క ఇమేజ్ గానీ, రికార్డులను కానీ పరిగణలోకి తీసుకుంటారు.
కాబట్టి ఏ హీరో అయినా కూడా సినిమా సక్సెస్ సాధించడానికే ప్రయత్నం చేస్తారు.ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు సైతం సక్సెస్ ఫుల్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
ఎందుకంటే బెస్ట్ కాంబినేషన్ సెట్ అయితేనే ఆ సినిమా మీద అంచనాలు భారీగా పెరుగుతాయి.తద్వారా కలెక్షన్లు కూడా భారీగా రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యం తోనే దర్శకులను ఎంచుకోవడంలో కూడా హీరోలు చాలా వరకు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు.ఇక కథ ఎంత బాగున్నా సినిమాను దర్శకుడు ఎంత బాగా తెరకెక్కించినప్పటికీ, సినిమాకి ఓపెనింగ్స్ రావాలంటే మాత్రం ఆ సినిమా మీద బజ్ అనేది క్రియేట్ ఇవ్వాలి.అలా క్రియేట్ అవ్వాలి అంటే బెస్ట్ కాంబినేషన్ ఉన్నప్పుడే అది క్రియేట్ అవుతుంది.
కాబట్టి ప్రతి హీరో కూడా సక్సెస్ ఫుల్ దర్శకుడుని ఎంచుకుంటారు.ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోగా కొనసాగుతున్న నాగచైతన్య ( Naga Chaitanya )సైతం స్టార్ డైరెక్టర్స్ తోనే సినిమా చేయాలని చూస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ‘కార్తికేయ 2 ( Karthikeya 2 )’ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న చందు మొండేటి( Chandoo Mondeti ) దర్శకత్వంలో తండేల్( Thandel ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
చూడాలి మరి ఈ సినిమాతో నాగచైతన్య తను అనుకున్న సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది…ఇక మొత్తానికైతే నాగచైతన్య మరోసారి తన స్టార్ డమ్ ను చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…
.