దక్షిణాఫ్రికాలోని( South Africa ) ఒక నేషనల్ పార్క్‌లో తీవ్రమైన విషాద సంఘటన చోటుచేసుకుంది.ఓ స్పానిష్ పర్యాటకుడిని( Spanish Tourist ) ఏనుగుల గుంపు తొక్కేయగా అతడు చనిపోయాడు.

 South Africa Elephants Trample Spanish Tourist To Death In Pilanesberg National-TeluguStop.com

అధికారుల ప్రకారం 43 ఏళ్ల వ్యక్తి ఆదివారం ముగ్గురు స్నేహితులతో పిలాన్స్‌బర్గ్ జాతీయ ఉద్యానవనానికి( Pilanesberg National Park ) సఫారీకి వెళ్లాడు.అక్కడ ఏనుగుల గుంపును చూసి ఫోటోలు తీయడానికి వాహనం నుండి దిగాడు.

అదే సమయంలో ఏనుగులు అతనిపై దాడి చేసి తొక్కేశాయి.

పర్యాటక శాఖ ప్రతినిధి పీటర్ నెల్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం… ఆ ఏనుగుల గుంపులో చిన్న ఏనుగు పిల్లలు కూడా ఉండటంతో, వాటిని కాపాడేందుకు నాయక ఏనుగు కోపంగా మారిందట.

పర్యాటకుడిపై దాడి చేసింది.తర్వాత మిగతా ఏనుగులు కూడా దాడి చేశాయి.ఆ పర్యాటకుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

“ఈ ఉద్యానవనంలో ఉండేవి అడవి జంతువులు.వాటి దగ్గరకు వెళ్లకూడదు.వాహనం నుండి దిగి ఫోటోలు తీసే ప్రయత్నం, సెల్ఫీలు తీయడం వంటివి ప్రమాదానికి దారితీస్తాయి.ఎందుకంటే, జంతువులు మనల్ని శత్రువులుగా లేదా తమ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన వారిగా భావిస్తాయి.” అని ఓ పర్యాటకుడు వెల్లడించాడు.

“పర్యాటకులు పార్కును సందర్శించేటప్పుడు వాహనాల లోపలే ఉండాలని, జంతువులకు, వాటి మధ్య భద్రతా దూరం పాటించాలని, జంతువులు స్వేచ్ఛగా తిరగడానికి అనుమతించాలని, ప్రత్యేకంగా నిర్దేశించిన ప్రాంతాలలోనే వాహనాల నుండి దిగాలని పర్యాటకులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాం” అని ఒక అధికారి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here