జెంటిల్‌మెన్‌ నుంచి భారతీయుడు 2 వరకు డైరెక్టర్‌ శంకర్‌ చేసిన సినిమాలు ఏ తరహాలో ఉంటాయో అందరికీ తెలిసిందే. సొసైటీలో జరుగుతున్న పలు అంశాలను తీసుకొని వాటికి ఒక పరిష్కారాన్ని అందించే దిశగా అతని సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా కరప్షన్‌ అనే అంశాన్నే ఎక్కువగా తన సినిమాలో ప్రొజెక్ట్‌ చేస్తుంటాడు. అయితే ఒక్కో సినిమాకి ఒక్కో ప్యాట్రన్‌ని తీసుకుంటూ అందర్నీ ఆకట్టుకునేలా చూపించడమే అతనిలోని స్పెషాలిటీ. 

తాజాగా కమల్‌హాసన్‌తో రూపొందించిన ‘భారతీయుడు 2’ కూడా ఆ తరహాలోనే ఉండే సినిమా. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడూ ఒక సినిమా తర్వాత మరో సినిమా చేసే శంకర్‌ ఈసారి మాత్రం ఒకేసారి రెండు సినిమాలను తెరకెక్కించే బాధ్యతను తీసుకున్నాడు. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ చేస్తున్న మరో డిఫరెంట్‌ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఇప్పటివరకూ చెప్పిన శంకర్‌ ఇందులో ఓ స్పెషాలిటీ కూడా ఉందనే విషయాన్ని రివీల్‌ చేశాడు. ఇప్పటివరకు తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చెయ్యని శంకర్‌ ఫస్ట్‌ టైమ్‌ ఈ సినిమా చేస్తున్నాడు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

ఇప్పటివరకు తన కథలతోనే సినిమాలు చేస్తూ వచ్చిన శంకర్‌ ఈసారి కార్తీక్‌ సుబ్బరాజు స్టోరీతో ‘గేమ్‌ ఛేంజర్‌’ని సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటివరకు వచ్చిన తన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నాడు. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు పక్కా మాస్‌ సినిమాగా ‘గేమ్‌ ఛేంజర్‌’ ఉంటుందనే హింట్‌ ఇచ్చాడు. అంతేకాదు, ఇప్పటివరకు వచ్చిన రామ్‌చరణ్‌ మాస్‌ సినిమాలకు పూర్తి భిన్నంగా వుంటూ మెగా ఫ్యాన్స్‌ని థ్రిల్‌ చేస్తుంది అంటున్నాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here