ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో అధ్యాయన కమిటీ
గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో అధ్యాయన కమిటీ ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. నాలుగైదు రోజుల్లో 20 నుంచి 30 పాఠశాలలు తిరిగి లోపాలు సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తామని, రాజకీయాలు అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని పరిస్థితులను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా.. పాఠశాల ఆవరణాలను క్లీన్ చేయించండి…ఇబ్బందికరమైన పరిస్థితులను వెంటనే తొలగించాలని కేటీఆర్ కోరారు.