హీరో విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా ప్లాప్ తర్వాత రచయిత విజయేంద్ర ప్రసాద్ కాల్ చేశారని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారు. చిన్న సహాయం చేస్తారా అని ఆయన అడిగినట్లు పూరి తెలిపారు. ఆయన సాయం ఏంటో కూడా ఆదివారం హన్మకొండలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను వెల్లడించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ హీరో రామ్ ‘ఇస్మార్ట్‌శంకర్’ కంటే డబుల్ ఎనర్జీతో ఈ సినిమా చేశామని తెలిపారు.