శోభిత ధూళిపాళ్ల(sobhita dhulipala) ఇప్పుడు ఈ పేరు ఇండియా మొత్తం మారుమోగిపోతుంది. ఇలా నాగ చైతన్య(naga chaitanya)తో ఎంగేజ్మెంట్ జరిగిందో లేదో అలా తెలుగు వారి సత్తా ఏమిటో చాటి చెప్పింది. ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకొని చై కి మ్యారేజ్ గిఫ్ట్ ని ముందుగానే ఇచ్చింది.
ఐఎండిబి.. ఇండియన్ మూవీ డేటా బేస్. ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ పోర్టల్ గా పేరొందిన ఈ సంస్థ ఎక్కువ ప్రజాదరణ పొందిన భారతీయ నటుల జాబితాని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో శోభిత నెంబర్ 2 స్థానంలో నిలిచింది. ఈ మేరకు సంస్థ అధికారకంగా కూడా ప్రకటించింది. చైతు తో ఎంగేజ్మెంట్ తర్వాత శోభిత పేరు ఒక్కసారిగా వైరల్ గా మారింది. దాంతో గూగుల్ లో చాలా మంది శోభిత పేరు ని సెర్చ్ చేసారు. అందుకే ఇప్పుడు ఇండియన్ పాపులర్ సెలబ్రిటీ గా నిలిచింది. కింగ్ ఖాన్ షారుక్ ని సైతం వెనక్కి నెట్టి మరి రెండవ ప్లేస్ ని సాధించింది. షారుక్ మూడవ ప్లేస్ లో నిలవగా ఫస్ట్ ప్లేస్ లో బాలీవుడ్ నటి శార్వరి వాఘ్ నిలిచింది.
ఇక శోభిత రీసెంట్ గా హాలీవుడ్ లో తెరకెక్కిన మంకీ మాన్ లో చేసింది. దేవ్ గిల్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు సైతం శోభిత చేతిలో ఉన్నాయి. ఇక చై, శోభిత ల పెళ్లి ముహూర్తం డేట్ కూడా త్వరలోనే బయటకి వచ్చే అవకాశం ఉంది. ఇక అక్కినేని ఫ్యాన్స్ ఐతే చైతన్య తో ఎంగేజ్మెంట్ జరిగిన రోజుల్లో సమంత(samantha) ఐఎండిబి లో ర్యాంకింగ్ ఎంత వచ్చిందని చూస్తున్నారు. మొన్న మార్చి నెలలో ఐఎండిబి ఈ దశాబ్దంలో అత్యధికంగా వీక్షించిన 100 మంది భారతీయ తారల జాబితాను విడుదల చేసింది. సమంత 13 వ స్థానంలో నిలిచింది.