Danam Nagender Vs AV Ranganath : హైదరాబాద్ లో నాలాలు, చెరువులపై ఆక్రమణలపై హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కొరడా ఝుళిపిస్తుంది. అక్రమ నిర్మాణాలను తొలగిస్తుంది. అక్రమ నిర్మాణాల్లో కొందరి రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని పార్కులు, నాలాలు, సరస్సుల్లో ఆక్రమణల తొలగించడానికి ప్రయత్నిస్తున్న హైడ్రాకు రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారు. ఇదిలా ఉంటే నందగిరి హిల్స్‌లోని కాంపౌండ్ వాల్‌ను కూల్చివేశారన్న ఆరోపణలపై ఖైరతాబాద్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌ఛార్జ్ వి.పాపయ్య దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం… గురు బ్రహ్మ నగర్ ప్రాంతానికి చెందిన కొందరు అక్రమంగా చొరబడి కాంపౌండ్ వాల్ ను కూల్చివేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలోనే వారు ఈ పని చేశారు, ఆయనే నిందితులను రెచ్చగొట్టారని ఆరోపించారు. జీహెచ్ఎంసీకి చెందిన భూమిలో ఉన్న గోడను కూల్చివేశారని, సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దానం నాగేందర్ పై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెనుక హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉన్నారన్న అనుమానంతో దానం నాగేందర్ ఆయన ఆరోపణలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here