పప్పును ఎక్కువగా కందిపప్పుతోనే వండుకుంటారు. కందిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి డయాబెటిస్ రోగులు… రోజూ కందిపప్పు తింటే ఎంతో మంచిది. దీనిలో ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఇది అడ్డుకుంటుంది. అలాగే కందిపప్పులో ఉండే మెగ్నీషియం, పొటాషియం, బి కాంప్లెక్స్ వంటివి మన శరీరానికి అత్యవసరమైనవి. అందుకే ప్రతిరోజూ తినాల్సిన ఆహారాల జాబితాలో కందిపప్పు కచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజూ కందిపప్పుతో అన్నం తిని, ఒక కోడి గుడ్డును తింటే చాలు పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. ఒకసారి పప్పు మిగిలిపోయినప్పుడు పైన చెప్పిన ఏదైనా ఒక రెసిపీని ప్రయత్నించి చూడండి.