నల్లగొండ జిల్లా: ప్రాజెక్టుల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని, నల్లగొండ జిల్లాలో చెరువులు కుంటలు నింపడానికి అభ్యంతరం ఏమిటని,యుద్ధ ప్రాతిపదికన చెరువులు కుంటలు నింపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దొడ్డి కొమరయ్య భవనంలో కుడతాల భూపాల్ అధ్యక్షతన జరిగిన సిపిఎం నల్గొండ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ మొదలైన నేపథ్యంలో రైతు భరోసా డబ్బులు రైతు ఖాతాలో జమ చేయాలని,కానీ ప్రభుత్వం పట్టించుకున్నట్లుగా లేదని విమర్శించారు.

 Ponds Should Be Filled Immediately Paladugu Nagarjuna, Ponds Filled , Paladugu N-TeluguStop.com

రైతు రుణమాఫీకి సంబంధించి గ్రామాలలో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, బ్యాంకులు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని తెలిపారు.

రైతులు గ్రీవెన్స్ సెల్ లో ఇచ్చిన దరఖాస్తులకు మోక్షం ఎప్పుడన్నారు.

ప్రభుత్వం క్షేత్రస్థాయి ప్రజల సమస్యలు విస్మరిస్తుందని, ఇప్పటికైనా వాటిని పరిష్కరించాలని కోరారు.మండలంలోని రోడ్లు గుంతల మాయమయ్యాయని, వెంటనే రోడ్ల మరమ్మత్తుకు నిధులు విడుదల చేయాలని శాశ్వత పరిష్కారంగా పక్కా బిటి రోడ్డు నిర్మించాలని కోరారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని,ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గావస్తున్న నిర్దిష్టమైన ప్రణాళిక పనులు చేయలేదని విమర్శించారు.

ప్రజలు సమయానం పాటిస్తున్నారని,ఈ ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోక ముందే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నలపరాజు సైదులు, మండల కమిటీ సభ్యులు జిల్లా అంజయ్య,కొండ వెంకన్న,బొలు రవీందర్, కోట్ల అశోక్ రెడ్డి,గోలి నరసింహ,మల్లెబోయిన లింగస్వామ,కుడుతాల భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here