తాడేప‌ల్లి మండ‌లంలోని నుల‌క‌పేట‌లో సామ్రాజ్యం అనే మ‌హిళ చీర‌లు, వస్త్రాల వ్యాపారం చేస్తోంది. స్థానికంగా ఉండే మ‌హిళ‌ల‌ను ప‌రిచ‌యం చేసుకుంటుంది. ఒక వ్యక్తితో స‌హ‌జీవ‌నం చేస్తూ నుల‌క‌పేట‌లో ఉంటోంది. తాము భార్యా భ‌ర్తలుగా స్థానికుల‌ను న‌మ్మించింది. ఈ నేప‌థ్యంలో కొంత‌మంది సంతానం లేని దంప‌తుల‌కు, కుటుంబ పోష‌ణ స‌రిగాలేని వారిని టార్గెట్‌గా చేసుకొని వారి ఫోన్ నెంబ‌ర్లను తీసుకుంటుంది. చిన్నారుల‌, ప‌సికందుల ఫొటోలు వాట్సాప్ ద్వారా పంపించి, చిన్నారుల అమ్మకాలు, కొనుగోలు గుట్టుగా సాగిస్తోంది. త‌మ వ‌ద్ద చిన్నారులు ఉన్నార‌ని, ఒక్కో చిన్నారి నాలుగు, ఐదు ల‌క్షల రూపాయల‌కు అమ్మకానికి పెడుతోంది. అవ‌స‌ర‌మైన వారు ఎవ‌రైనా ఉంటే, త‌న‌కు స‌మాచారం ఇవ్వాల‌ని పేర్కొంటుంది. ఇలా ఒక వ్యక్తికి వాట్సాప్‌లో చిన్నారుల ఫొటోలు పంపించింది. దీంతో గుట్టుర‌ట్టు అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here