షూటింగ్ లో హీరో గాయపడ్డాడని తెలిస్తే అభిమానులు ఆందోళన చెందుతారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు తమ హీరో గాయపడ్డాడని తెలిస్తే.. ఆందోళన చెందడంతో పాటు, తమకి తెలియకుండానే కాస్త ఆనందపడతారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా ఆనందపడటానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, ఏదైనా షూటింగ్ లో ఎన్టీఆర్ గాయపడ్డాడంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. (Jr NTR Injured)

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ (Devara) సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. రీసెంట్ గానే తన షూట్ పార్ట్ ని పూర్తి చేశాడు. అయితే చివరి షెడ్యూల్ లో ఎన్టీఆర్ గాయపడ్డాడట. స్వల్ప గాయమే కావడంతో మూవీ టీం ఈ న్యూస్ ని బయటకు రానివ్వలేదట. దేవర టీంకి, ఎన్టీఆర్ సన్నిహితులకు మాత్రమే ఈ విషయం తెలుసని సమాచారం. సన్నిహిత వర్గాల ద్వారా ఇప్పుడిప్పుడే ఈ విషయం బయటకు వస్తోంది. దీంతో ఈ న్యూస్ తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. గాయం సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి, దేవర ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ కి కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈ గాయం సెంటిమెంట్ ఉంది. డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలు చేయడం ఆయనకు అలవాటు. ఈ క్రమంలో గాయలవుతుంటాయి. అయితే షూటింగ్ లో ఎన్టీఆర్ గాయపడ్డాడంటే.. ఆ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. ‘స్టూడెంట్ నెం.1’ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఆ మూవీ ఆయనను మొదటి సక్సెస్ ని ఇచ్చింది. ‘ఆది’ షూటింగ్ లో కత్తి తగలడం వల్ల, ఎన్టీఆర్ చేతికి బలమైన గాయమైంది. ఆ సినిమా ఏస్థాయి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ ని తిరుగులేని మాస్ హీరోని చేసింది. ఇక ‘సింహాద్రి’ షూటింగ్ లో ఎన్టీఆర్ తలకి గాయమైంది. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా, ఆయనను టాప్ స్టార్ ని చేసింది. ‘యమదొంగ’ చిత్రీకరణలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఆ సినిమా ఆయనను ఫ్లాప్ ల నుంచి బయటపడేసి, మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించింది. ‘అదుర్స్’ టైంలో టీడీపీ ప్రచారానికి వెళ్ళి, కారు ప్రమాదంలో ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ‘బృందావనం’ క్లైమాక్స్ చిత్రీకరణలో ఎన్టీఆర్ గాయపడ్డారు. ఆ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఇక గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ టైంలో స్వల్పంగా గాయపడగా, ఆ సినిమా ఎన్టీఆర్ కి గ్లోబల్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇలా ఎన్టీఆర్ షూటింగ్ టైంలో గాయపడిన ప్రతిసారీ.. ఆయనకి, ఆయన ఫ్యాన్స్ కి సినిమా రిజల్ట్ ఆనందాన్నిచ్చింది. ఇప్పుడు దేవర విషయంలో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here