ఓటీటీలోకి కొన్ని క్రైమ్ థ్రిల్లర్స్ ట్రెండింగ్ లో ఉంటాయి. అందులోను కొన్ని ట్విస్ట్ లు, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ వంటివి ఉంటే మరింతగా అటువంటి సినిమాలకి ఆదరణ లభిస్తాయి.12th ఫెయిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన నటుడు విక్రాంత్ మస్సే.

12th ఫెయిల్ మూవీలో ఐపీఎస్ కావాలనే కోరికతో కఠోర శ్రమతో సాధించిన మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మస్సే ఒదిగిపోయాడు. అతను ఈ మధ్య వరుసగా హిందీలో సినిమాలు చేస్తున్నాడు. అతను నటించిన సెక్టార్-36(Sector-36) డైరెక్ట్ ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవ్వనుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 13 న స్ట్రీమింగ్ కి రానుంది.

దర్శకుడు ఆదిత్య నింబాల్కర్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ‌మడోక్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా సెక్టార్-36 ను నిర్మిస్తున్ననాయి. సిటీలో కొంతమంది చిన్నపిల్లల మిస్సింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే పోలీస్ ఆఫీసర్ గా విక్రాంత్ మస్సే కన్పించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారు ఈ మూవీని లిస్ట్ లో చేర్చుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here