ఒక సీన్‌లో నటుడుగానీ, నటిగానీ పెర్‌ఫార్మ్‌ చెయ్యడం ఎంత ముఖ్యమో ఆ తర్వాత ఆ క్యారెక్టర్‌కి డబ్బింగ్‌ చెప్పడం కూడా అంతే ముఖ్యం. పాతతరం నటీనటులు ఎవరి క్యారెక్టర్లకు వాళ్ళే డబ్బింగ్‌ చెప్పుకునే వారు. తర్వాతి రోజుల్లో ఒక భాషకు చెందిన ఆర్టిస్టులు మరో భాషలో నటించాల్సి వచ్చినపుడు డబ్బింగ్‌ సమయంలో సమస్య వచ్చేది. దాన్ని నివారించడానికి ఇతర డబ్బింగ్‌ ఆర్టిస్టులతో ఆ డైలాగులు చెప్పించేవారు. ఇప్పుడు ఈ ప్రక్రియ సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ఏ భాషలోనైనా ఒరిజినల్‌ వాయిస్‌ కంటే డబ్బింగ్‌ ఆర్టిస్టులు చెప్పే వాయిసే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే కొందరు నటీనటులు ఆ అవకాశం ఇతరులకు ఇవ్వకుండా ఎంత కష్టమైనా తమ క్యారెక్టర్‌కి తామే డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు. అలాంటి వారిలో సాయిపల్లవి ఒకరు. 

సాయిపల్లవికి మంచి బ్రేక్‌ ఇచ్చిన సినిమా ‘ఫిదా’. ఈ సినిమాలో ఆమె పెర్‌ఫార్మెన్స్‌, తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్‌ బాగా పాపులర్‌ అయ్యాయి. తెలుగు రాకపోయినా ఎంతో నేచురల్‌గా ఉండేలా ఆమె చెప్పిన డైలాగ్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. అయితే ఆ సినిమాలో సాయిపల్లవికి తానే డబ్బింగ్‌ చెప్పానంటూ ఓ కుర్రాడు యూ ట్యూబ్‌ ఛానల్స్‌లో సందడి చేస్తున్నాడు. అతని పేరు ఆద్య హనుమంతు. అతను చెప్పే మాటలు విని అందరూ షాక్‌ అవుతున్నారు. తను డబ్బింగ్‌ చెబుతున్న వీడియోను కూడా ఫిదా యూనిట్‌ రిలీజ్‌ చేసింది కదా. ఇతను డబ్బింగ్‌ చెప్పాను అంటాడేమిటి? అని అందరూ ఆలోచనలో పడ్డారు. 

ఫిదా సినిమాకే కాదు సాయిపల్లవి నటించిన చాలా సినిమాలకు హనుమంతు డబ్బింగ్‌ చెప్పిన మాట వాస్తవమే. అయితే ఇందులో చిన్న తిరకాసు ఉంది. అదేమిటంటే.. ఒక ప్రముఖ సింగర్‌తో ఒక పాట పాడించాలి అనుకున్నప్పుడు సంగీత దర్శకుడు, రచయిత.. ఆ పాట ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా పాడితే జనానికి రీచ్‌ అవుతుందనేది దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ఓ ట్రాక్‌ సింగర్‌తో పాడిస్తారు. ఒరిజినల్‌గా పాడే సింగర్‌ బిజీ అయితే రికార్డింగ్‌ స్టూడియోకి వచ్చి ఆ పాటను ప్రాక్టీస్‌ చేసి పాడేంత టైమ్‌ ఉండదు. అందుకే వారి కోసం ఇలాంటి సదుపాయాన్ని కల్పిస్తుంటారు. స్టూడియోకి వచ్చిన సింగర్‌కి ఒక ట్రాక్‌ సిద్ధంగా ఉంటుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని తన స్టైల్‌లో పాడడం చాలా ఈజీ. ఇంతకుముందు పాటల కోసం అలా చేసేవారు. ఇప్పుడు డబ్బింగ్‌ విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. 

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ఆద్య హనుమంతు చెప్పింది కూడా అదే. ఒరిజినల్‌గా తాను చెప్పలేదని, ట్రాక్‌ డబ్బింగ్‌ మాత్రమే చెప్పానని అంటున్నాడు. అయితే అతను చెప్పిన విషయాన్ని మరోలా ప్రచారం చేస్తోంది మీడియా. సాయిపల్లవికి డబ్బింగ్‌ చెప్పింది ఆద్య హనుమంతేనని స్పష్టం చేస్తోంది. తను సాయిపల్లవికి ఎలాంటి పరిస్థితిలో డబ్బింగ్‌ చెబుతాడో స్పష్టంగా ఆ ఇంటర్వ్యూలో వివరించాడు హనుమంతు. ఇక సాయిపల్లవి సినిమాలు తమిళ్‌, కన్నడ భాషల్లో డబ్‌ అయితే మాత్రం అక్కడ తను ఒరిజినల్‌గానే డబ్బింగ్‌ చెబుతానని అంటున్నాడు. ఇదీ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ఆద్య హనుమంతు అసలు కథ. 


ప్రస్తుతం సోషల్‌ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇక అందులో వచ్చే న్యూస్‌ నిజమా? అబద్దమా? అని తెలీక జనాలు కన్ఫ్యూజన్‌ లో పడిపోతున్నారు. కొన్ని వార్తల్లో నిజాలు ఉన్నప్పటికీ.. చాలా మంది, చాలా ఛానల్స్‌ ఫేక్‌ న్యూస్‌ ను ప్రచారం చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. తప్పుడు థంబ్‌ నెయిల్స్‌ తో యూట్యూబ్‌ లో ఎన్నో వీడియోలు రావడం మనకు తెలియనిది కాదు. అయితే ఈ విషయంలో సెలబ్రిటీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ  వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఓ కుర్రాడు హీరోయిన్‌ సాయి పల్లవికి డబ్బింగ్‌ చెప్పేది నేనే అంటూ ఓ ఛానల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరి అతడు నిజంగానే ఆమెకు డబ్బింగ్‌ చెప్పాడా? లేదా? అసలు నిజం ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.


సాయి పల్లవి నటించిన చాలా సినిమాలకు డబ్బింగ్‌ చెప్పేది నేనే అంటూ.. ఆద్య హనుమంతు అనే కుర్రాడు తాజాగా ఓ ఛానల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో అచ్చం ఆమె చెప్పినట్లే కొన్ని డైలాగ్స్‌ కూడా చెప్పాడు. దాంతో నిజంగానే అతడు సాయి పల్లవికి డబ్బింగ్‌ చెప్పాడని అందరూ అనుకుంటున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే? సినిమా షూటింగ్‌ జరిగేటప్పుడు డబ్బింగ్‌ చెప్పరు అన్న విషయం అందరికి తెలిసిందే. షూట్‌ మ్నెత్తం కంప్లీట్‌ అయిన తర్వాత డబ్బింగ్‌ చెబుతారు.

%ఈ క్రమంలో వర్క్‌ స్పీడ్‌ గా అవ్వడం కోసం స్టార్స్‌ గొంతు మ్యచ్‌ అయ్యే ఆర్టిస్ట్‌ ల చేత ట్రాక్‌ డబ్బింగ్‌ చెప్పిస్తారు. ఆ తర్వాత హీరో, హీరోయిన్స్‌ దాన్ని చూసి డబ్బింగ్‌ చెప్తారు. ఇది ఫైనల్‌ వెర్షన్‌. ఈ కుర్రాడు చెప్పింది కూడా ట్రాక్‌ డబ్బింగే. ఆ విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో కూడా అతడు  చెప్పాడు. దాన్ని తప్పుడు థంబ్‌ నెయిల్స్‌ తో రాంగ్‌ గా ప్రొజెక్ట్‌ చేయడంతో.. ఈ వీడియో వైరల్‌ గా మారింది. నిజానికి సాయి పల్లవికి ఎవ్వరూ డబ్బింగ్‌ చెప్పరు. ఆమె సినిమాలకు స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంటుంది. అదీకాక సాయి పల్లవి ఫిదా సినిమాకి డబ్బింగ్‌ చెప్పిన వీడియో ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో కింద ఉంద మీరూ చూసేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here