మూవీ : వీరాంజనేయులు విహార యాత్ర

నటీనటులు: వి.కె నరేశ్, ప్రియా వడ్లమాని , రాగ్ మయూర్, శ్రీలక్ష్మి, ప్రియదర్శిని, రవితేజ, హర్షవర్దన్ తదితరులు

రచన: అనురాగ్ పాలుట్ల, శ్రీసుశి

ఎడిటింగ్: నరేశ్ ఏడుప, హరి శంకర్  టిఎన్

మ్యూజిక్: ఆర్.హెచ్. విక్రమ్

సినిమాటోగ్రఫీ: సి. అంకుర్

నిర్మాతలు: బి. బాపినీడు, సుధీర్ ఈదర

దర్శకత్వం: అనురాగ్ పాలుట్ల

ఓటీటీ: ఈటీవీ విన్

కథ: 

ఇది వీరాంజనేయులు కుటుంబ కథ. వీరాంజనేయులు (బ్రహ్మానందం) రైల్వే ఉద్యోగి, తన ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన డబ్బుతో గోవాలో ‘హ్యాపీ హోమ్’ అనే ఇంటికి కొంటాడు. అతను చనిపోయాక ఆ ఇంటి భాద్యత వీరాంజనేయులు కొడుకు నాగేశ్వరరావు (నరేశ్) మీద పడుతుంది. నాగేశ్వరరావు వైజాగ్ లోని ఓ స్కూల్ లో టీచర్. అయితే ఆ స్కూల్ యాజమాన్యం ఇంగ్లీష్ సరిగ్గా రాని కారణంగా అతడిని స్కూల్ నుండి తీసేస్తారు. ఇక అదే సమయంలో నాగేశ్వరరావు కూతురు సరయు( ప్రియా వడ్లమాని) పెళ్ళి చేయాల్సి వస్తుంది. నాగేశ్వరరావు కొడుకు వీరు( రాగ్ మయూర్), నాగేశ్వరరావుకి అమ్మ(శ్రీలత) , భార్య సావిత్రి(ప్రియదర్శిని) ఉంటారు. ఇక కూతరు పెళ్ళి కోసం గోవాలోని హ్యాపీ హోమ్ ని అమ్మడానికి అక్కడికి కుటుంబంతో సహా నాగేశ్వరరావు బయల్దేరతాడు. అయితే కూతురు సరయు పెళ్ళి చేసుకోబోయే అతడికి, కొడుకు వీరుకి గొడవ ఉంటుంది. మరి నాగేశ్వరరావు గోవా ప్రయాణం సక్సెస్ అయ్యిందా? కూతురు సరయు పెళ్ళి జరిగిందా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఈ మధ్యకాలంలో వచ్చిన 90s వెబ్ సిరీస్ తర్వాత మళ్ళీ అలాంటి కథ ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూసేవారికి ఈ వీరాంజనేయులు విహార యాత్ర మూవీ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ కథంతాన చుట్టూనే తిరుగుతుంది. ఓ మిడిల్ క్లాస్ కుటుంబంలో వచ్చే ప్రాబ్లమ్స్ వాటిని ఎదుర్కోవడానికి ఆ ఇంటి పెద్ద ఏం చేశాడనేదే కథ.

అడల్ట్ సీన్లు లేకుండా, బూతులు మాట్లాడకుండా కుటుంబంతో కలిసి చూసేలా కథ సాగుతుంది. ఈ కథలో గోవాకి వెళ్దామని ఫ్యామిలీతో కలిసి నాగేశ్వరరావు అనుకున్నంత వరకు సాఫీగా సాగుతుంది . అయితే ఆ ట్రిప్ లో కామెడీ సీన్లు ఎక్కువగా లేకపోవడం, స్లోగా సాగడంతో ఆడియన్స్ కి కాస్త బోరింగ్ అనిపిస్తుంది.

నాగేశ్వరరావు పాత్రలో సగటు మధ్యతరగతి కుటుంబ పెద్దగా నరేశ్ జీవించేశాడు. ఇంప్రెసివ్ పర్ఫామెన్స్, ఇంకా క్లైమాక్స్ లో అమ్మ  చెప్పే కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. తన లక్ష్యాన్ని తోడుగా లేని ఏ ఒక్కరికి కూడా నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు లేదంటు వచ్చే డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎమోషనల్ సీన్లు అన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి. అయితే కొడుకు, కూతురు పాత్రలని కాస్త బాగా డిజైన్ చేయొచ్చు. నాగేశ్వరరావు పాత్ర తర్వాత మళ్ళీ అంతటి పర్ఫామెన్స్ రాగ్ మయూర్ కి దక్కింది. 

కుటుంబంతో కలిసి చూసేలా ప్రతీ సీన్ ని చాలా జాగ్రత్తగా తీసినట్టుగా తెలుస్తుంది. స్లోగా సాగే కథనం కాస్త ఇబ్బంది పెట్టినా చివరి వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీకెండ్ కి ఫ్యామిలీతో కలిసి చూసే మూవీల జాబితాలో ఈ మూవీని చేర్చొచ్చు. సి. అంకుర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్.హెచ్ విక్రమ్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

నాగేశ్వరరావుగా నరేశ్ ఒదిగిపోయాడు. రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని, శ్రీలక్ష్మి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా :  కాస్త నెమ్మదిగా సాగే కుటుంబ కథా చిత్రం. వన్ టైమ్ వాచెబుల్.

రేటింగ్ : 2.75 / 5 


✍️. దాసరి మల్లేశ్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here