సూర్యాపేట జిల్లా: ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చే వారికి రోగ నిర్దారణ పరీక్షలు చేసిన తదుపరి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ సూర్యాపేట లోని ప్రభత్వ జనరల్ హాస్పిటల్ ని సందర్శించి డాక్టర్లతో సీజనల్ వ్యాధులపై,రోగ నిర్దారణ కేంద్రాల నిర్వహణపై,ఫార్మసి స్టోర్, బ్లడ్ బ్యాంక్ కేంద్ర నిర్వహణపై,ఓపి,ఐపి సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Those Coming To Government Hospitals Should Be Given Better Treatment Along With-TeluguStop.com

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.విషజ్వరాలు ఎక్కవ మొత్తంలో నమోదవుతున్న సమయం కాబట్టి వైద్యులు అలాగే సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని,

ఏమైనా అవసరం ఉంటే అదనపు బెడ్లు ఏర్పాటు చేసుకోవాలని,హాస్పిటల్ కి వచ్చే వారికి నాణ్యమైన మెడిసిన్ ఇవ్వాలని అధికారులకు సూచించారు.

ఏమైనా అవసరం ఉంటే వెంటనే తనకు తెలియజేయాలని అన్నారు.తదుపరి బ్లడ్ బ్యాంక్,రోగ నిర్దారణ కేంద్రాలు,జనరల్ వార్డులు, ఎమర్జెన్సీ వార్డులను జిల్లా కలెక్టర్ సందర్శించారు.

ఈ సమావేశంలో హాస్పిటల్ సూపరిటిడెంట్ డాక్టర్ శ్రీకాంత్,రెసిడెన్సీ మెడికల్ అధికారి డాక్టర్ జనార్దన్,డాక్టర్ గిరిధర్, డాక్టర్ కిరణ్,డాక్టర్ తరుణి,జూనియర్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here