రాజన్న సిరిసిల్ల జిల్లా: స్వాతంత్ర్య  దినోత్సవం సందర్భంగా ఈ రోజు 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస రావు జాతీయ జెండా ఎగురవేసి పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

 17th Police Battalion, Sardapur Independence Day Celebrations , Independence Day-TeluguStop.com

ఈ సందర్భంగా కమాండెంట్ యస్.శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ రోజు మనమందరం 78వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషముగావుంది.స్వాతంత్య్ర దినోత్సవం అనేది మనల్ని, మన చరిత్రతో అనుసంధానించే ఒక అందమైన సందర్భం.మనం పీల్చే స్వేచ్ఛ వాయువుల వెనక ఎంతోమంది ప్రాణదానం ఉంది.మన స్వాతంత్య్ర దినోత్సవాన్ని చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించారు.భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం కోసం మహాత్మ గాంధి,సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహానుభావులు నేలకొరిగారు.

బ్రిటీషర్లతో అలుపెరుగని పోరాటంలో కనుమరుగయ్యారు.ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశం 200 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందింది.

స్వాతంత్య్రాన్ని సంపాదించుకుంది.స్వాతంత్య్ర సమరయోధుల అపారమైన ధైర్యసాహసాలు, త్యాగాలే బ్రిటీష్ వారిని గద్దె దించి దేశాన్ని విముక్తం చేశాయి అని తెలియజేశారు.

ఈ సందర్భముగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిలో ఆర్ .ఎస్.ఐ వెంకటరెడ్డి కి, ఏ.ఆర్.ఎస్.ఐ రాములు, మజారుద్దీన్ కి సేవ పథకములు అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాందాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి ఇ .ప్రమీల,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here