మోటో జీ45 స్పెసిఫికేషన్లు (అంచనా)..

మోటోరోలా నుంచి వస్తున్న మోటో జీ45 5జీ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన అనేక లీక్స్​, రెండర్లు ఇంటర్నెట్​లో చక్కర్లు కొడుతున్నాయి. టిప్​స్టర్ఆర్సెన్ లుపిన్.. స్మార్ట్​ఫోన్ ఎక్స్​పెక్టెడ్​ డిజైన్​ను ప్రదర్శించడానికి మోటో జీ45 మార్కెటింగ్ మెటీరియల్ ఫొటోలను ఎక్స్​లో @MysteryLupin పోస్ట్ చేశారు. లీకైన చిత్రాల ప్రకారం ఈ స్మార్ట్​ఫోన్ బ్లూ, మెజెంటా, గ్రీన్ కలర్ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. ప్రీమియం లుక్​తో పాటు మంచి గ్రిప్​ను ఇవ్వడానికి ఈ స్మార్ట్​ఫోన్ వెనుక భాగంలో వెజిటేరియన్​ లెథర్ కవర్​ను కలిగి ఉండే అవకాశం ఉందని లీక్ సూచించింది. ఈ స్మార్ట్​ఫోన్ సైడ్స్​లో ఫ్లాట్​గా ఉండి నిగనిగలాడే ఫినిషింగ్​ను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే, ఇది ప్లాస్టిక్​తో వస్తుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here