ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆదరణ ఉన్న స్పోర్ట్‌ ఫుట్‌బాల్‌. ఈ ఆటను ఇష్టపడే వారికి డేనియల్‌ బ్రేవో గురించి తెలిసే ఉంటుంది. 80వ దశకంలో ఫ్రాన్స్‌ తరఫున ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు బ్రేవో. అతని కుమారుడు లుకాస్‌ బ్రేవో. ఫ్రెంచ్‌ సినిమాల్లో హీరోగా నటిస్తూ, పాపులర్‌ టీవీ షోల్లో పాల్గొంటూ మంచి ఫాలోయింగ్‌ ఏర్పరుచుకున్నాడు. అతను చేసే షోల్లో ఎమిలీ ఇన్‌ ప్యారిస్‌కి ఎక్కువ ఆదరణ ఉంది. ఆ షోలో లుకాస్‌ బ్రేవో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ రాజమౌళి, ఎన్టీఆర్‌నిగానీ ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం రామ్‌చరణ్‌ పెర్‌ఫార్మెన్స్‌ గురించే ప్రత్యేకంగా చెప్పాడు. 

ఎమిలీ ఇన్‌ ప్యారిస్‌ షోలో.. ఇండియన్‌ సినిమాల్లో మీకు నచ్చిన యాక్టర్‌ ఎవరు? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తాను ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ చూశానని, అందులో ఒక యాక్టర్‌ పెర్‌ఫార్మెన్స్‌ తనకు బాగా నచ్చిందని చెప్పాడు. అయితే ఆ యాక్టర్‌ ఎవరు అంటే పేరు చెప్పలేక సినిమా ప్రారంభంలో పోలీస్‌ క్యారెక్టర్‌ చేసిన రామ్‌చరణ్‌ని గుర్తు చేశాడు. యాంకర్‌ రామ్‌చరణ్‌ పేరు చెప్పడంతో అప్పుడు గుర్తు తెచ్చుకొని, అతను అద్భుతమైన నటుడు అని కితాబిచ్చాడు. సినిమాలో ఆయన చేసిన రిస్కీ షాట్స్‌, ఎమోషనల్‌ ప్రజెన్స్‌ నిజంగా చాలా అద్భుతం. ఈ సినిమాకి ఆస్కార్‌ అవార్డు వచ్చిందని తెలిసింది. అది నిజంగా వర్త్‌బుల్‌ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు లుకాస్‌ బ్రేవో. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here