తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారుల ఆత్మ గౌరవ సంక్షేమ బోర్డు ఏర్పాటుకై గత ఆరు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఏకైక ఫోరం తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం హైదరాబాద్ అల్వాల్ లోని రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశం నందు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీమ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్ రెడ్డి ప్రతిపాదన మేరకు రాష్ట్ర కమిటీ ఆదేశ అనుసారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన కళాతపస్వి యెల్ల పోశెట్టి ని కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ గా నియామక ధ్రువీకరణ పత్రమును పంపిచనైనది.గత 35 సంవత్సరాలుగా కళాకారుల సాంస్కృతిక కళా రంగం నందు చేస్తున్న కళా సేవలను గుర్తించి నియమించనైనదని తెలియజేస్తూ వీరి పదవి కాలం తేదీ 15-8-2024 నుండి 14-8-2025 వరకు రాష్ట్ర కన్వీనర్ గా కొనసాగుతారని తెలియజేశారు.

 Appointment Of Yella Poschetti As State Convener Of Artists Section-TeluguStop.com

యెల్ల పోశెట్టి మాట్లాడుతూ నాకు కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ గా బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీమ శ్రీనివాసరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇంద్ర కుమార్ TUF ఛానల్ప్రతి నిధి వెంగల భాస్కర్ రాష్ట్ర కార్యదర్శి జానకి రెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ పేరుపేరునా కళాభివందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు రాష్ట్ర కన్వీనర్ గా బాధ్యతలును ఊచ తప్పకుండా మీ ఆదేశానుసారంగా పనిచేయగలనని తెలియజేస్తున్నాను అన్నారు

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here