రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘కల్కి'(Kalki)తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ (Raja Saab) చేస్తున్నాడు. దీంతో పాటు మరో కొత్త సినిమా మొదలు కాబోతుంది.

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘ఫౌజీ’ (Fauji) అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. రేపు(ఆగష్టు 17న) పూజా కార్యక్రమంతో ఈ మూవీ లాంచ్ కానుంది. అంతేకాదు, ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని వినికిడి.

భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందునాటి కథతో ‘ఫౌజీ’ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. 1943 ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ‘ఆజాద్ హింద్ ఫౌజ్’లో ఒక సైనికుడిగా ప్రభాస్ కనిపిస్తాడట. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here