రాజన్న సిరిసిల్ల జిల్లా: మానవీయ సంబంధాలను పటిష్టం చేస్తూ ప్రేమానురాగాలను పంచడమే రక్షా బంధన్ ఉద్ధేశమని వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రజిత అన్నారు.రక్షాబంధన్ పురస్కరించుకుని శనివారం పాఠశాల, అంగన్వాడి విద్యార్థిని, విద్యార్థులు రాఖీ కట్టుకొని ప్రేమను పంచుకున్నారు.

 Pre-rakshabandhan Celebrations At Kishtampet Primary School, Pre-rakshabandhan C-TeluguStop.com

ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ.విద్యార్థులు నైతిక విలువలతో విద్యలో రాణించి బావి భారత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.అనురాగం.ఆప్యాయత.

అనుబంధాలను పంచేదే రాఖీ పండుగ అని అభివర్ణించారు.ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, నవీన, పుష్పలత, మంజుల, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here