పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్‌లోని మరో సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో సినిమా వుంటుందని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రబాస్ ‘ది రాజా సాబ్’ చేస్తున్నారు. ఆగస్ట్ 17 ఉదయం ప్రభాస్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ ప్రారంభోత్సవంలో ప్రభాస్ కొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాకి సంబంధించిన వివరాలు ఏమిటి అనేది ఇప్పటివరకు తెలియదు. దానికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ సినిమాను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేస్తామంటూ ఆ పోస్ట్‌లో తెలిపారు. సినిమాకి సంబంధించిన ఎనౌన్స్మెంట్లో ఏం చెబుతారు, సినిమా ఎలా ఉండబోతోంది అని అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఆ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.