రాజన్న సిరిసిల్ల జిల్లా : బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ రుద్రంగి మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్,కేరళ స్కూల్, నారాయణ టెక్నో స్కూల్,ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ ఈ దేశం యొక్క సనాతన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర చాలా గొప్పది , ఈ రక్ష బంధన్ పండుగ అనేది చాలా ఏళ్లుగా జరుపుకుంటున్న పండుగ, అలాగే దేశానికి స్వాతంత్ర ఉద్యమ సమయంలో నుండి జాతీయతను ఐక్యం చేయడంలో కొన్ని పండుగలని మన మహనీయులు మనకు అందించారు.

 Pre-rakshabandhan Ceremony At Rudrangi Kerala School Premises, Pre-rakshabandhan-TeluguStop.com

రక్షాబంధన్ కేవలం అన్నా చెల్లెలు బంధానికి ప్రతిక నే కాదు ,

ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా దేశాన్ని రక్షించడంలో మన యొక్క పాత్ర చాలా గొప్పగా ఉండలని, ఇందుకే నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనం దేశానికి రక్ష అని ఆర్ఎస్ఎస్ రక్ష కట్టించి దేశానికి సంబంధించిన ఏలాంటి కష్టంలోనైనా , ఆపత్కాలంలోనైనా కులం మతం బేధం లేకుండా మనం సిద్ధంగా ఉండాలని ఈ రక్ష కట్టుకొని సంకల్పం తీసుకోవడమే ఈ రాష్ట్రీయ స్వయంసేవక్ యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా ఈ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిలో జాతీయతను ఐక్యం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్ది శ్రవణ్,మంచే వసంత్,కంటే నవీన్,లక్కాకుల సంతోష్,బొబ్బిలి పవన్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here