AP AarogyaSri : ఏపీలోని నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు(ఆరోగ్య శ్రీ సేవలు) యథావిధిగా కొనసాగుతాయని ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. ప్రభుత్వంతో నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తమ సమస్యపై మంత్రి సానుకూలంగా స్పందించారని నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం తెలిపింది.