వెబ్ సిరీస్ : మనోరథంగల్ 

నటీనటులు : మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, దుర్గా కృష్ణ, అపర్ణా బాలమురళి, పార్వతీ తిరువోతు, సిద్దిఖీ, బిజు మీనన్, హరీష్ ఉత్తమన్, జాయ్ మాథ్యూ , మధు, అసిఫ్ అలీ , నదియా, ఇంద్రజిత్ తదితరులు

రచన : ఎమ్ టీ వాసుదేవన్ నయ్యర్

ఎడిటింగ్: ఎమ్ ఎస్ అయ్యప్పన్ నయ్యర్

మ్యూజిక్: బిజిబల్

సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్

నిర్మాతలు : విక్రమ్ మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్

దర్శకత్వం: ప్రియదర్శన్, రంజిత్, శ్యామ్ ప్రసాద్ , మహేశ్ నారాయణ్, అశ్వతీ నయ్యర్, జయరాజ్, రతీష్ అంబత్ 

ఓటీటీ: జీ 5


కథ : 

ఓ గ్రామంలో బాపుట్టి(మోహన్ లాల్), తన ఫ్రెండ్ చెల్లి నబీషా(దుర్గా కృష్ణ) ని ప్రేమిస్తాడు. అయితే నవీషా తల్లి ఓ ధనవంతుడితో పెళ్ళి  చేయాలని చూస్తుంది. మరి కుంజలి ఎవరు? బాపుట్టికి తనకి మధ్య గొడవేంటి? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది మొదటి ఎపిసోడ్ కథ. జర్నలిస్టుగా పనిచేస్తున్న వేణుగోపాల్ తన సోదరి కోసం శ్రీలంక వెళ్ళే ప్రయాణమే ఈ ఎపిసోడ్. భర్తతో గొడవల కారణంగా వేరే చోటికి వచ్చి, అక్కడి స్నేహితుతాలి సహాయంతో ఎలా మారిందనేది మూడవ ఎపిసోడ్ కథ. రోజులు మారేకొద్దీ ఊరిలో ఉండే వారి ఆలోచనాశైలీ ఎలా మారిందనేది శిలాలిఖితమనే నాల్గవ ఎపిసోడ్ కథ. మానవ సంబంధాల విలువ చెప్తూ సాగే కథే అయిదవ ఎపిసోడ్ విల్పనా. సొంత ఊరిని వదిలి పనికోసం విదేశాలకి వెళ్ళిన ఓ జంట కథే షెర్లాక్.  ఇలా ఒక్కో ఎపిసోడ్  ఒక్కో కథతో సాగుతుంది. పూర్తిగా తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

మనోరథంగల్ (Manorathangal) భిన్నమైన కథ. ఓపికతో చూడగలిగే వారికి వరం. అలా కాదు కథ, కథనం నీట్ గా తక్కువ సమయంలో పూర్తవ్వాలని అనుకునేవారికి శాపం. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో కథ. ప్రతీ కథలోను స్లోగా సాగే సీన్లు ఆడియన్ కి చికాకు తెప్పిస్తాయి.

రచయిత చెప్పాలనుకున్న కథని నటీనటులంతా భుజాలపై మోసారనిపిస్తుంది. ఎందుకంటే వారి పాత్రల్లో అలా నిమగ్నమై చేశారు. కథనం నెమ్మదిగా సాగినా పూర్తిగా అర్థమయ్యేలా ప్రెజెంట్ చేయలేకపోయారు మేకర్స్. 


తొమ్మిది ఎపిసోడ్ లు తొమ్మిది భిన్నమైన కథలైనా.. అవన్నీ ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూసిన విధంగానే ఉన్నాయి. అయితే కాస్త ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకుంటే ఇది మోస్ట్ వాచెబుల్ సిరీస్ అయ్యేది. రచయిత రాసుకున్న కథలన్నింటిలో ట్విస్ట్ లు పెద్దగా లేకపోవడం, థ్రిల్ మిస్ అవ్వడం, ఎంటర్‌టైన్మెంట్ లేకపోవడం కాస్త మైనస్.

కథలు వేరైనా వాటి సారం ఒక్కటే అన్నట్టు ప్రతీ ఎపిసోడ్ సాగుతుంది. అయితే ఇవి అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవచ్చు. ఇక తెలుగు డబ్బింగ్ కొన్ని పాత్రలకి సెట్ కాలేదు. బిజిబల్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.  సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎమ్ ఎస్ అయ్యప్పన్ నయ్యర్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: 

కమల్ హాసన్ ప్రతీ ఎపిసోడ్ ను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, బిజు మీనన్, సిద్దిఖీ, అపర్ణ బాలమురళి అందరు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. 

ఫైనల్ గా :  స్లోగా సాగే కథనం ఇబ్బంది పెట్టినా.. వన్ టైమ్ వాచెబుల్. 

రేటింగ్: 2.5 / 5

✍️. దాసరి మల్లేశ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here