సూర్యాపేట జిల్లా: ప్రభుత్వ ఉద్యోగులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు.సూర్యాపేట జిల్లా కోదాడ తహశీల్దార్ కార్యాలయంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న తహశీల్దార్ సాయిరాంపై బదిలీ వేటు వేస్తూ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పి.

 Strict Action If Employees Cause Trouble To Farmers District Collector Tejas Nan-TeluguStop.com

సుజిత్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.రెవెన్యూ ఇన్స్పెక్టర్ పి.సుజిత్ పై రైతుల నుండి పలు ఆరోపణలు రావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

కోదాడ ఆర్దివోను విచారణకు ఆదేశించారు.విచారణలో వాస్తవాలు నిజమేనని తేలడంతో ఈ ఉత్తర్వులు జారీచేశారు.

అదే విధంగా సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో పరిపాలన విభాగంలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్న నాగారం తహశీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ షఫీపై పలు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టి విచారణలో వాస్తవాలు రుజువు కావడంతో సదురు ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here