కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు సూపర్ స్టార్ కృష్ణ(krishna)ఆయన  నట వారసుడు గా మహేష్ బాబు(mahesh babu)సృష్టిస్తున్న సునామి అందరకి తెలిసిందే. టాప్ స్టార్స్ లో  ఒకడిగా రాణిస్తూ  తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించాడు. ఇక  కృష్ణ మరో నట వారసుడుగా రమేష్ బాబు(ramesh babu)కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు.అనారోగ్య కారణాలతో 2022 లో రమేష్ బాబు మరణించాడు. ఆయన లేని లోటుని తీర్చడానికి  తనయుడు సినీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలైన కొన్ని ఫోటోలు అభిమానుల్లో జోష్ ని తీసుకొస్తున్నాయి.


రమేష్ బాబు కొడుకు పేరు జయకృష్ణ(jaya krishna)తెలుగు సినిమానికి త్వరలోనే తన సత్తా చాటబోతున్నాడు. ఈ నేపథ్యంలో  ఫోటో షూట్ జరిగింది.ఇప్పుడు ఆ ఫోటోలు  ఒక రేంజ్ లో ట్రెండ్ ని  సృష్టిస్తున్నాయి. ఇక వాటిని చూసిన  కృష్ణ, మహేష్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. పర్ఫెక్ట్ సినీ ఫిగర్ అని అంటున్నారు. అదే విధంగా ఎలాంటి కథ ద్వారా జయకృష ఎంట్రీ ఇస్తాడనే  ఆసక్తి కూడా  ఉంది.

ఆ సినిమాకి సంబంధించిన వివరాలు కూడా  త్వరలోనే తెలియనున్నాయి. గత నెలలో జరిగిన  జయకృష్ణ పుట్టిన రోజుని అభిమానులు ఎంతో ఘనంగా జరిపి తమ ఆశీస్సులు అందచేసారు. మహేష్ ఆశీస్సులు కూడా జయకృష్ణ కి మెండుగా ఉన్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here