టీజీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సులకు సంబంధించి తరుచూ ఏదో ఒక ఘటన జరుగుతోంది. ఇటీవల బస్సు వెనక ఉండే రెండు చక్రాలు ఊడిపోయన ఘటన మరువకముందే.. మరో ఘటన జరిగింది. తాజాగా బస్సు రన్నింగ్‌లో ఉండగానే పార్టులు ఊడిపోయి రోడ్డుపై పడ్డాయి. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. TS 31 Z 0054 బస్సు రన్నింగ్‌లో ఉండగా బస్సు పార్టులు ఊడిపోయి రోడ్డుపైన పడ్డాయి. పెద్ద శబ్దం రావడంతో.. బస్సులో ఉన్న ప్రయాణికులు, రోడ్డుపై ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన లో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కింద పడిపోయిన పార్టులను బస్ డ్రైవర్, కండక్టర్ తీసుకొని మళ్లీ ప్రయాణం మొదలు పెట్టారు. అయితే.. ఏ పార్ట్ ఊడిపోయింది.. బస్సుకు ఏమైందనే వివరాలను డ్రైవర్ గానీ.. కండక్టర్ గానీ చెప్పలేదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here