ఇవిగో ఉదాహరణలు…

  • చంద్రబాబు ముఖ‌్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండున్నర నెలల్లో నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలకు వెళ్లారు.సీఎం తొలి రెండు పర్యటనల్లో ఏం జరిగిందో తెలుసుకోడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. అధికారిక హ్యాండిల్స్‌లో ఫోటోలు విడుదల చేసి ఐఅండ్‌పీఆర్‌ చేతులు దులుపుకుంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన విశేషాలను వివరించడంలో విఫలమయ్యారు.
  • వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్య నేపథ్యంలో జరిగిన పరిణామాలను వివరించడంలో కూడా పోలీసులు, సిఎంఓ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. మృతుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పనిచేయడం లేదని సొంత వాహనంలో వెళ్లారు. తనకు భద్రతను కుదించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ సెక్యూరిటీ విషయంలో ఏమి జరిగిందో వివరించడానికి అటు సిఎంఓకు, ఇటు పోలీసులకు ఒక పూట సమయం పట్టింది. అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది.
  • ఇటీవల గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన ముఖాముఖిలో ఓయువకుడు తాను తోపుడు బండిపై చికెన్ అమ్ముకుంటానంటూ బాబుతో చెప్పారు. ప్రభుత్వం తరపున సాయం అందిస్తే స్వయం ఉపాధి పొందుతానంటూ చెప్పాడు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆ యువకుడు స్థానిక ఎమ్మెల్యే అనుచరుడని, హోటళ్లలో గతంలో చేసిన వ్లాగ్ వీడియోలను వైసీపీ విపరీతంగా ట్రోల్ చేసింది.
  • గుడివాడలో నిర్వహించిన కార్యక్రమాన్ని పొలిటికల్ కన్సల్టెన్సీకి అప్పగించడంతో ఈ సమస్య తలెత్తినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండున్నర నెలల్లో ప్రధాన ప్రతిపక్షం చేసే ఆరోపణల్ని తిప్పి కొట్టడంలో టీడీపీ శిబిరం విఫలమైన సందర్బాలు చాలా ఉన్నాయి. ఇసుక ధరలు, మద్యం పాలసీ, సూపర్ సిక్స్ హామీల అమలు వంటి విషయాల్లో వైసీపీ చెలరేగిపోతున్న టీడీపీ నుంచి స్పందన కొరవడుతోంది.

పెన్షన్లపై దుమారం…

ఏపీలో 2024 జూన్‌ నాటికి ఏటా 66 లక్షల మంది పింఛన్లకు పెన్షన్ల కోసం ఏటా రూ.24వేల కోట్ల రుపాయల్ని ప్రభుత్వం వెచ్చించింది. వైఎస్సార్ ఆసరా పథకంలో వివిధ రకాల సామాజిక పెన్షన్లలో భాగంగా రాష్ట్రంలో 78,94,169మందికి లబ్ది కలిగింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 78,94,169మందికి రూ.25,570కోట్లను ఏటా చెల్లించారు. ఇప్పుడు అది రూ.35వేలకు చేరింది. ప్రతి నెల పెన్షన్లకు రూ.2600కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here