పరిచయ వ్యాఖ్యలు అవసరం లేని సినీ సెలబ్రటిస్ లో సుహాస్(suhas)కూడా ఒకరు. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి నేడు హీరోగా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. దిల్ రాజు లాంటి బ్యానర్ లో కూడా మూవీ చేస్తున్నాడంటే సుహాస్ రేంజ్ ని అర్ధం చేసుకోచ్చు. లేటెస్ట్ గా నా ఫేవరేట్  నా పెళ్లాం  అని అంటున్నాడు. ఆ విషయం ఏంటో చూద్దాం.

సుహాస్ నయా మూవీ  జనక అయితే గనక(janaka ayithe ganaka)దిల్ రాజు ప్రొడక్షన్స్ పై  హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మిస్తున్నారు. మూవీ స్టార్ట్ అయినప్పటినుంచే అందరిలో విపరీతమైన ఆసక్తి నెలకొని  ఉంది. పైగా జనక అయితే గనక అనే విభిన్నమైన  టైటిల్ ని ప్రకటించినప్పటి నుంచే  అందరు మూవీ మీద ఒక లుక్ వెయ్యడం ప్రారంభించారు.ఈ నేపథ్యంలో  రీసెంట్ గా విడుదలైన తొలి సాంగ్ అందరిని ఆకర్షిస్తుంది. నా ఫేవరెట్ నా పెళ్లాం అనే  లిరిక్ తో  సాంగ్  ప్రారంభం అయ్యింది.   అద్భుతమైన  మెలోడీ  ట్యూన్ తో సాంగ్ సాగగా లిరిక్స్ కూడా అందరకి అర్ధమయ్యే రీతిలో  సూపర్ గా ఉన్నాయి. భార్య పై తనకి ఎంత ప్రేమ ఉందో  హీరో ఈ సాంగ్ ద్వారా చెప్పబోతున్నాడు. అదే విధంగా  తక్కువ టైం లోనే ఎక్కువ వ్యూస్ ని సంపాదించే దిశగా కూడా వెళ్తుంది. అలాగే రచయిత  కృష్ణకాంత్ ని సంగీత దర్శకుడు విజయ్ బుల్గనిన్ ని మెచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ కూడా చేస్తున్నారు.

 కంప్లీట్  కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా  తెరకెక్కుతుండగా  సంగీర్తన విపిన్  హీరోయిన్ గా చేస్తుంది.  రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రల్లో కనపడబోతున్నారు.ఆల్రెడీ  ఇప్పటికే రిలీజైన  పోస్టర్స్, టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి .సందీప్ రెడ్డి బండ్ల డైరెక్టర్  మూవీలోని  కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని ధీమా ని  మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here