Wednesday Motivation: ఆధ్యాత్మిక గురువు గౌరంగ్ దాస్ నిజమైన స్నేహితుడికి ఉండాల్సిన లక్షణాలను పంచుకున్నారు. స్నేహం ముసుగులో కొంతమంది ఫేక్ స్నేహితులు కూడా ఉంటారు. వారు స్నేహంగా వ్యవహరిస్తూనే మీకు అన్యాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న స్నేహితులు… నిజమైన వారా? లేక ఫేక్‌గా నటిస్తున్న వారో మీరు తెలుసుకోవాలి. మీ అమ్మా,నాన్న, అక్కా, చెల్లి… ఈ కుటుంబాన్ని మనం ఎంచుకోలేం. కానీ స్నేహితులు మాత్రం మనం ఎంచుకునే ఒక కుటుంబం. ఎంత మంచి స్నేహితులను ఎంచుకుంటే మీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది.