ఆ మెసేజెస్ ను బ్లాక్ చేసేయండి..

వాట్సాప్ కు యూజర్లలో విస్తృతమైన రీచ్, పాపులారిటీ ఉంది. ఇది కొంత ఇబ్బందులను కూడా తీసుకువస్తోంది. గుర్తు తెలియని నంబర్ల నుంచి, అవసరం లేని మెసేజ్ లు మనల్ని చాలా సార్లు డిస్టర్బ్ చేస్తుంటాయి. అంతేకాదు, గుర్తుతెలియని నంబర్ల నుంచి మెసేజెస్ ను పంపించి, సైబర్ స్కామ్స్ కు కూడా పాల్పడుతుంటారు. అలాంటి సైబర్ నేరగాళ్ల, ఆటగట్టించేలా, అవసరం లేని మెసేజ్ ల తలనొప్పి లేకండా ఉండేలా.. వాట్సాప్ ఒక పరిష్కారాన్ని వెతికింది. త్వరలో గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చిన మెసేజ్ లను బ్లాక్ చేసేలా వాట్సాప్ కొత్త ఫీచర్ ను విడుదల చేయనుంది. ఈ ఫీచర్ పేరు ““Block messages from unknown senders”. ఇది సేవ్ చేయని కాంటాక్ట్ ల నుండి వచ్చే సందేశాలను బ్లాక్ చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here