ఈ మధ్య చాలా ప్రదేశాలలో దేవుడి విగ్రహాలు చాలా పెద్దగా కట్టడం గమనిస్తూనే ఉన్నాము .ఇకపోతే.

 90-foot Hanuman Statue Unveiled In Houston, Prana Pratishtha ,held Today ,housto-TeluguStop.com

, మీరు ఎప్పుడైనా 90 అడుగుల హనుమాన్ విగ్రహం చూశారా.? అవునండి మీరు విన్నది నిజమే.అమెరికా( America )లో 90 అడుగులు ఎత్తు గల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతున్నాయి.

ఇంత పెద్ద హనుమాన్ విగ్రహాన్ని చూసి హనుమాన్ భక్తులు జై హనుమాన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

అమెరికాలోని టెక్సాస్( Texas ) రాష్ట్రంలోని హోస్టన్ నగరంలో 90 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.అంతేకాకుండా నాలుగు రోజులపాటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు .హోస్టన్ నగరంలో అష్టలక్ష్మి దేవాలయం ప్రాంగణంలో ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.ఈ విగ్రహానికి “ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ ” అని నామకరణం చేశారు విగ్రహ నిర్వాకులు.

ఇక ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిగా చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.అంతేకాకుండా భారతీయ సాంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలాగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఇక విగ్రహం ఆవిష్కరణ సమయంలో హెలికాప్టర్ తో విగ్రహం పై పూల వర్షం కురిపించారు.విగ్రహావిష్కరణం పూర్తి అయిన తర్వాత జై వీర హనుమాన్ అని నామస్మరణతో ఆ ప్రాంగణం మొత్తం మారు మోగిపోయింది.అలాగే ఉత్తరా అమెరికాలోనే ఇది ఎత్తైన విగ్రహంగా గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక వాస్తవానికి ఈ విగ్రహం తెలంగాణలో లోని వరంగల్ నుంచి రవాణా చేసినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here