గులాబీ మూవీలో ఈ వేళలో నువ్వు ఏం చేస్తు ఉన్నావు అని పాడినా, చూడాలని ఉంది సినిమాలో సౌందర్య క్యారక్టర్ లోకి  పరకాయప్రవేశం చేసి తన గొంతుతో మెగాస్టార్ చిరంజీవి తో పాటు ప్రేక్షకులని  ముద్దు ముద్దు మాటలతో అలరించినా   సునీత కే చెల్లింది.ఇలా ఎన్నో చిత్రాల్లో  గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణించి తన కంటు ఒక బ్రాండ్ ని సంపాదించుకుంది.లేటెస్ట్ గా చిరంజీవి  గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు అవి  టాక్ అఫ్ ది డే గా నిలిచాయి.

 అగస్ట్ 22 చిరంజీవి బర్త్ డే.. ఈ  సందర్భంగా ఒక ఛానల్ లో 100 దేశాలలో ఉన్న చిరు అభిమానులతో  జూమ్ లైవ్ ప్రోగ్రాం జరిగింది. ఇందులో సునీత కూడా పాల్గొని చిరు తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది. ఏ జనరేషన్ ని  అయినా ఇన్ స్పైర్ చెయ్యగలిగే వ్యక్తి చిరంజీవి గారు. చూడాలని ఉంది టైం లో సౌందర్య గారికి డబ్బింగ్ చెప్పేటప్పడు చిరంజీవి గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. గొంతు నీకు  దేవుడు ఇచ్చిన వరం. మున్ముందు నువ్వు మరింతగా రాణిస్తావని ఆశీర్వదించారు. ఆ తర్వాత  చిరంజీవి గారికి చాలా కావాల్సిన అమ్మాయిగా మారిపోయాను. వాళ్ళింట్లో అమ్మాయిలాగా కూడా మారానని  చెప్పుకొచ్చింది. అలాగే   అవతలి వాళ్ళని చిరంజీవి  ఎంత  మెస్మరైజ్ చేస్తారో అని  గతంలో జరిగిన  ఒక విషయాన్నీ కూడా  ప్రేక్షకులతో పంచుకుంది. 

ఒక ఫంక్షన్ లో  మా అబ్బాయి ఆకాష్, నేను చిరు ని కలిసాం. ఏం చదువుతున్నావని ఆకాష్ ని  అడిగారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నానని  చెప్తే అభినందించారు. కానీ ఆకాష్ చదువుతుంది ఇంటర్ కాదు డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇదే విషయాన్ని మా వాడ్ని అడిగితే ఆయన్ని చూడగానే నేను ఏం మాట్లాడుతున్నానో అర్ధం కాలేదు మమ్మి అని  చెప్పాడు. అంతలా చిరు లో  మెస్మరైజ్ చేసే మ్యాజిక్ ఉందని  చెప్పుకొచ్చింది. అలాగే మా అబ్బాయి ఆకాష్ చిరంజీవి గారికి వీరాభిమాని అని రేపు చిరు బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా ఓపెనింగ్ కాబోతుందని కూడా చెప్పింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here