ఎవడు కొడితే దిమ్మ తిరిగి  మైండ్  బ్లాక్ అవుతుందో  వాడే పండుగాడు.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడకొట్టిందంట,యుద్ధం చాతకనోడు ధర్మం గురించి మాట్లాడతాడు, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా, భయానికే మీనింగ్  తెలియని బ్లడ్ రా నాది, కళ్ళు ఉన్నోడు ముందుమాత్రమే చూస్తాడు, దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు, గుర్తుపెట్టుకో నీకంటె తోపే ఎవడు లేడిక్కడ,  ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూ జ్   చెయ్యొద్దు ఎందుకంటే కన్ఫ్యూ జ్   లో నే  ఎక్కువ  కొట్టేస్తాను.  సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) నోటి వెంట ఈ డైలాగులు రావడం వల్లే ఒక రేంజ్ లో అవి  సక్సెస్ అయ్యాయనే విషయం అందరకి తెలిసిందే.అందుకే ఇప్పుడు ప్రపంచ సినిమాకే తలమానికమైన డిస్నీ పిక్చర్స్  మహేష్ తో ఒక డీల్ ని సమకూర్చుకుంది. 

ప్రపంచ సినీ ప్రేమికులందరు అమెరికన్ మూవీ  ముఫాసా: ది లయన్ కింగ్(mufasa:the lion king) ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో అడుగుపెతుందా అని ఎదురుచూస్తున్నారు. తెలుగు  ప్రేక్షకులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇప్పుడు వాళ్ళందరికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా తెలుగు వెర్షన్ కి సంబంధించి  మహేష్ బాబు ముఫాసా కి తన వాయిస్ ని ఇవ్వనున్నాడు.ఈ  విషయాన్నీ డిస్ని పిక్చర్స్ అధికారకంగా ప్రకటించింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా లో ప్రత్యక్షమవడంతో మహేష్ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2019 లో వచ్చిన లయన్ కింగ్ కి సీక్వెల్ గా  ముఫాసా: ది లయన్ కింగ్ వస్తున్న విషయం తెలిసిందే. ముఫాసా అనేది  సింహం యొక్క పేరు.  డిసెంబర్ 20  న  ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో విడుదల కానుంది. వరల్డ్ వైడ్  కూడా ఇదే డేట్ కి ల్యాండ్ అవుతుంది.

ఇక మహేష్ బాబు కూడా ముఫాసా కి వాయిస్ ఓవర్ ఇవ్వడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. డిస్నీ యొక్క బ్లాక్‌బస్టర్ లెగసీ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు టైమ్‌లెస్ స్టోరీ టెల్లింగ్‌ని నేను ఎప్పుడూ మెచ్చుకుంటూనే ఉంటాను, ముఫాసా పాత్ర తన కొడుకును నడిపించే ప్రేమగల తండ్రిగా మాత్రమే కాకుండా అడవికి అత్యున్నతమైన రాజుగా నన్ను ఆకర్షిస్తుంది.  డిసెంబర్ 20న తెలుగులో పెద్ద స్క్రీన్‌పై ముఫాసా ని  నా కుటుంబంతో పాటు నా అభిమానులు కూడా ఆదరిస్తారని తెలిపాడు.  ఆగస్టు 26న ఉదయం 11.07 గంటలకు తెలుగు ట్రైలర్‌ కూడా విడుదల కానుంది

బ్రహ్మానందం,  అలీ కూడా తమ వాయిస్ ఓవర్ ని ఇచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here