పిటిష‌న‌ర్ త‌ర‌పున న్యాయ‌వాది వాద‌న‌లు వినిపిస్తూ ఫోన్ మాట్లాడుతూ చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయార‌ని, ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయ‌ని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామ‌ని, అదే గైర్హాజ‌రు అయితే రూ.2 కోట్లు ఇస్తామ‌ని చెప్పార‌ని ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు త‌రపున రేవంత్ రెడ్డి బేర‌సారాలు జ‌రిపార‌ని, ఈ కేసులో ఏ1 రేవంత్ రెడ్డి, ఏ2 ఉద‌య సింహ అని, స్టీఫెన్ స‌న్ ఇంటికి రేవంత్ రెడ్డి డ‌బ్బుల‌తో వెళ్లారని, బ్రీఫ్డ్ మీ కాల్‌లో చంద్రబాబు రూ.5 కోట్లు ఆశ చూపార‌ని తెలిపారు. చంద్రబాబు త‌ర‌పు సీనియ‌ర్ న్యాయ‌వాది సిద్ధార్థ లూథ్రా త‌న వాద‌న‌లు వినిపించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది మేనకా గురుస్వామి, ఏఓఆర్ శ్రావ‌ణ్ కుమార్ హాజ‌ర‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here