ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)తో సంబంధం ఉన్న సభ్యులకు గుడ్ న్యూస్! పోర్టల్‌లో సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఐటీ సిస్టెమ్ 2.01ను తీసుకురావాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సూచనల మేరకు పోర్టల్, యాప్‌నకు సంబంధించిన సమస్యలను మూడు నెలల్లో పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు. కొత్త విధానం వచ్చాక పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి క్లెయిమ్ చేసుకోవడం, సెటిల్ చేయడం వంటివి మునుపటి కంటే సులువు అవుతాయి. దీంతో కొత్త విధానం వచ్చిన తర్వాత, ఉద్యోగాలు మారినప్పుడు మెంబర్ ఐడీ (ఎంఐడీ) బదిలీ చేయాల్సిన అవసరం ఉండదు.
Home International EPFO alerts : ఈపీఎఫ్ఓ సభ్యులకు గుడ్ న్యూస్- ఇక ఆ కష్టాలన్నీ దూరం!-epfo alerts...